ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడికి ఊహించని అనుభవం..అతడి స్థితి చూసి భార్యకు భారీ షాక్..!

ABN , First Publish Date - 2022-07-09T03:25:45+05:30 IST

విమాన ప్రయాణాల్లో లగేజీ మిస్సవడం సాధారణమే. ఇటువంటి సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు పోయిన లగేజీని ప్రయాణికుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ.. బ్రిటన్‌ నుంచి శ్రీలంకకు వచ్చిన బ్రిటన్ దేశస్థుడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది.

ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడికి ఊహించని అనుభవం..అతడి స్థితి చూసి భార్యకు భారీ షాక్..!

ఎన్నారై డెస్క్: విమాన ప్రయాణాల్లో లగేజీ మిస్సవడం సాధారణమే. ఇటువంటి సందర్భాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు పోయిన లగేజీని ప్రయాణికుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ.. బ్రిటన్‌ నుంచి శ్రీలంకకు వచ్చిన బ్రిటన్ దేశస్థుడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో శ్రీలంకకు చేరుకున్న అతడు.. తన లగేజీ తెరిచి చూస్తే లోపల దుస్తులన్నీ చిరిగిపోయి కనిపించాయి. దీంతో.. అతడికి నోట మాట రాలేదు. ఎలుకలు కొట్టేసినట్టు దుస్తులన్నీ చిన్న చిన్న ముక్కలుగా చిరిగిపోయాయి. అతడు ఈ విషయాన్ని తన భార్య కారెన్ నోల్యాండ్‌కు చెప్పడంతో ఆమెకు కూడా నోటమాట రాలేదు. చివరకు తేరుకున్న ఆమె జరిగిన ఉదంతం గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో  ట్వీట్ చేసింది. 


‘‘ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌‌లో.. నా భర్త ఎలాంటి స్థితి ఎదుర్కొన్నాడో చూశారా! మాంచెస్టర్ నుంచి కొలంబో చేరుకునే క్రమంలో ఆ బ్యాగు ఇలా చిరిగిపోయింది. మా ఫిర్యాదును మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ దుస్తుల్లో నా భర్త ఓ సముద్రపు దొంగలా కనిపిస్తున్నాడు. ఇలాంటి సెలవులను చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.’’ అని కారెన్ ట్వీట్ చేసింది. చిరిగిపోయిన దుస్తులు ధరించిన తన భర్త ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో.. ఈ ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. 


కాగా దీనిపై ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. మొదట్లో ఈ విషయం గురంచి తమకు తెలియదని, కానీ సమాచారం అందిన వెంటనే అతడికి కావాల్సిన సాయం చేశామని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా.. బ్రిటన్‌ వ్యక్తికి క్షమాపణలు కూడా చెప్పింది.

Updated Date - 2022-07-09T03:25:45+05:30 IST