Viral Video: అయ్యో పాపం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. పబ్లిక్‌లో ప్రేయసికి ప్రపోజ్ చేస్తే..

ABN , First Publish Date - 2022-05-06T22:00:53+05:30 IST

ఒక వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు.. బాగా రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు..

Viral Video: అయ్యో పాపం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. పబ్లిక్‌లో ప్రేయసికి ప్రపోజ్ చేస్తే..

ఒక వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు.. బాగా రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేశాడు.. రెస్టారెంట్‌లో ఉన్న అందరూ తననే చూస్తుండడంతో ఆ గాళ్‌ఫ్రెండ్ అసహనానికి లోనైంది.. బాయ్‌ఫ్రెండ్ మీద కోపగించుకుని తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో జరిగింది. జోహెన్నస్‌బర్గ్‌లో ఉన్న ఓ మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు. ప్రియురాలు అక్కడ కౌంటర్ ముందు నిల్చుని ఉండగా అతను జేబులో నుంచి ఉంగరం తీసి మోకాళ్ల మీద కూర్చుని.. `నన్ను పెళ్లి చేసుకుంటావా` అని అడిగాడు. ముందు షాకైన ఆ మహిళ, అందరూ తమనే చూస్తుండడంతో అసహనానికి గురైంది. తల అడ్డంగా ఊపుతూ ఆ రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటికి కొన్ని వేల మంది ఈ వీడియోపై కామెంట్లు చేశారు. 



Read more