Viral Video: ప్రమాద హెచ్చరికలను ఎందుకు పాటించాలి అన్నదానికి ఈ వీడియోనే సరైన ఉదాహరణ..!

ABN , First Publish Date - 2022-05-21T22:57:09+05:30 IST

సాహస కృత్యాలు అప్పుడప్పుడు ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి.

Viral Video: ప్రమాద హెచ్చరికలను ఎందుకు పాటించాలి అన్నదానికి ఈ వీడియోనే సరైన ఉదాహరణ..!

సాహస కృత్యాలు అప్పుడప్పుడు ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. కొందరు ప్రమాద హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సహసాలకు దిగుతుంటారు. అలాంటప్పుడు పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయి. చైనాకు చెందిన ఓ వ్యక్తి ప్రమాద హెచ్చరికను పట్టించుకోకుండా డేంజరస్ స్టంట్ చేయబోయాడు. అనుకోకుండా ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చదవండి..

Viral Video: హోమ గుండం చుట్టూ వధూవరులు ప్రదక్షిణలు చేస్తుండగా.. పురోహితుడి నుంచి ఉహించని కామెంట్స్.. పెళ్లివేడుకలో నవ్వులే నవ్వులు


చైనాలోని సుసోంగ్ కౌంటీలోని నిషేధిత ప్రాంతంలో ఉన్న ఓ వాటర్ ఫాల్ వద్దకు ఓ వ్యక్తి వెళ్లి పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ప్రవాహం జోరుగా ఉండడంతో పాటు రాళ్లు జారుతున్నా అతను పట్టించుకోకుండా పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సగం వరకు వెళ్లాక పట్టు తప్పిపోయి వేగంగా కిందకు దొర్లకుంటూ వచ్చేశాడు. కింద చిన్న నీటి గుంటలో ఉన్న రాయి మీద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించున్నాడు. గాయాలతో బయటపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-05-21T22:57:09+05:30 IST