మాన్సాస్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-07-25T05:05:29+05:30 IST

వేతనాల కోసం మాన్సాస్‌ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. చింతలవలస ఇంజినీరింగ్‌ కళాశాల ఎదుట కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, మహిళా ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. 15 నెలలుగా జీతాలకు నోచుకోలేదని, చెల్లింపునకు మాన్సాస్‌ చైర్మన్‌, కరస్పాండెంట్‌ ఆదేశాలు ఇచ్చినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాన్సాస్‌ ఉద్యోగుల నిరసన
కళ్లకు గంతలు కట్టి నిరసన తెలుపుతున్న ఎంఆర్‌ కళాశాల (కోట) సిబ్బంది

15 నెలలుగా జీతాల్లేవని ఆవేదన

విజయనగరం రూరల్‌, జూలై 24: వేతనాల కోసం మాన్సాస్‌ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. చింతలవలస ఇంజినీరింగ్‌ కళాశాల ఎదుట కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, మహిళా ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. 15 నెలలుగా జీతాలకు నోచుకోలేదని, చెల్లింపునకు మాన్సాస్‌ చైర్మన్‌, కరస్పాండెంట్‌ ఆదేశాలు ఇచ్చినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్‌ కళాశాల(కోట)లో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఇదే రోజు కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. అంతకుముందు పీవీజీ రాజు విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఎంఆర్‌ కళాశాల అటానమస్‌, పీజీ కశాశాల, పార్మసీ కళాశాలతో పాటు ఇతర విద్యా సంస్థల ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-25T05:05:29+05:30 IST