
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు ప్రథమశ్రేణి కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు కుర్మ విజయరావు ఎన్నికయ్యారు. బుధవారం కోర్టు హాల్లో జరిగిన ఎన్నికలు ఉత్కంఠకు తెరలేపాయి. అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడ్డారు. అధ్యక్ష స్థానానికి పోటీ పడిన కుర్మ విజయరావు, నగేష్, జాడి చొక్కయ్య ఒకరిపై మరొకరు పై చేయిగా పోటీ పడ్డారు. బార్ అసోసియేషన్‌లో 40మంది సభ్యులు ఉండగా 36మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కుర్మ విజయ్రావుకు13, నగేష్‌కు12, జాడి చొక్కయ్యకు 11 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు మెజారిటీతో గెలుపును కుర్మ విజయ్ కైవసం చేసుకున్నారు. ఫలితాలను ఎన్నికల అధికారి న్యాయవాది మేదరమెట్ల శ్రీనివాసరావు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా ఎ. రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శిగా చిర్ర రవికుమార్, సహాయ కార్యదర్శిగా చిర్ర సరస్వతి, కోశాధికారిగా ఇందుపల్లి అశోక్‌కుమార్, మహిళ ప్రతినిధిగా కె. శైలజ, లైబ్రరీయన్ కార్యదర్శిగా ఎ. సర్వేశ్వరారవు, స్సోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా బద్దం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి