అధిక ఏటీఎంలున్న రాష్ట్రం మనదే

ABN , First Publish Date - 2022-03-22T16:40:26+05:30 IST

దేశంలోనే అధిక ఏటీఎం కేంద్రాలున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలియజేసింది.

అధిక ఏటీఎంలున్న రాష్ట్రం మనదే

పెరంబూర్‌, మార్చి 21: దేశంలోనే అధిక ఏటీఎం కేంద్రాలున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలియజేసింది. ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఖాతా నుండి ఏ సమయంలోనైనా నగదు పొందేలా ఏటీఎం కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2021 డిసెంబరు వరకు నిర్వహించిన సర్వేలో తమిళనాడులో 28,540 ఏటీఎం కేంద్రాలతో మొదటి స్థానంలో నిలిచింది. తదుపరి మహారాష్ట్ర (27,945), ఉత్తరప్రదేశ్‌ (23,460), కర్ణాటక (19,613), పశ్చిమ బెంగాల్‌ (13,565), గుజరాత్‌ (12,699), ఆంధ్రప్రదేశ్‌ (12,357), తెలంగాణా (11,910), రాజస్తాన్‌ (11,296), కేరళ (11,054) రాష్ట్రాలు వరుసగా నిలిచాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.


Updated Date - 2022-03-22T16:40:26+05:30 IST