వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డ క్రికెటర్లు!

ABN , First Publish Date - 2021-05-15T17:24:42+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్-14 సీజన్ ప్రారంభానికి ముందు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆటగాళ్లెవరూ ముందుకు రాలేదనే విషయం తాజాగా బయటపడింది.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డ క్రికెటర్లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్-14 సీజన్ ప్రారంభానికి ముందు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆటగాళ్లెవరూ ముందుకు రాలేదనే విషయం తాజాగా బయటపడింది. వ్యాక్సిన్ కంటే బయో బుబులే సురక్షితమని క్రికెటర్లు భావించారట. వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం వస్తుందని ఆటగాళ్లు భయపడ్డారట. కరోనా ఉద్ధృతి పెరగడంతో ఐపీఎల్-14 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 


`సీజన్ ప్రారంభానికి ముందు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆటగాళ్లు నిరాకరించారు. జ్వరం వస్తుందేమోనని భయపడ్డారు. అవగాహనా లోపం వల్లే అలా జరిగింది. బయో బబుల్ సురక్షితమేనని ఆటగాళ్లు భావించారు. టీకా తీసుకోమని యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేయలేదు. విదేశీ ఆటగాళ్లు, కోచ్‌లు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నారు. అయితే వారికి టీకా వేయించడం చట్టబద్ధం కాదు. దాంతో కుదర్లేద`ని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-05-15T17:24:42+05:30 IST