కలెక్టర్‌కు పలువురి శుభాకాంక్షలు

Jun 17 2021 @ 00:52AM
కలెక్టర్‌ పమేలా సత్పథికి ఫొటో ఫ్రేమ్‌ అందజేస్తున్న ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు

 భువనగిరి రూరల్‌, జూన్‌ 16: కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి పమేలా సత్పథిని పలువురు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా  ఆర్యవైశ్య  మహాసభ ఆధ్వర్యంలో ఫొటో ఫ్రేమ్‌ను బుధవారం బహూకరించారు.  కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మల్ల గాని శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు బుస్స రమేష్‌లు పాల్గొన్నారు. 

 మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో..

కలెక్టర్‌ను భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం సభ్యు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంఐ చైర్మన్‌ రమేష్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌  మోహన్‌రెడ్డి, డీఎంవో నాగేశ్వర శర్మ, కార్యదర్శి అంజిత్‌రావు, సాయికిషోర్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

ఆలేరు: కలెక్టర్‌ను టీపీసీసీ కార్యదర్శి జనగామ ఉపేందర్‌రెడ్డి  మర్యా దపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. Follow Us on: