పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత భార్య!

ABN , First Publish Date - 2022-09-08T02:20:32+05:30 IST

మావోయిస్టు (Maoist) మిలిటరీ ఇన్‌చార్జ్ బడే చొక్కారావు భార్య రజితను పోలీసులు అరెస్ట్‌ (arrest) చేసినట్లు రజిత కుటుంబసభ్యులు తెలిపారు.

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత భార్య!

భద్రాద్రి: మావోయిస్టు (Maoist) మిలిటరీ ఇన్‌చార్జ్ బడే చొక్కారావు భార్య రజితను పోలీసులు అరెస్ట్‌ (arrest) చేసినట్లు రజిత కుటుంబసభ్యులు తెలిపారు. చర్ల మావోయిస్టు ఏరియా కమాండర్‌గా రజిత ఉన్నారు. రజితతో పాటు మరో నలుగురు దళ సభ్యులను అరెస్ట్‌ చేశారని చెబుతున్నారు. అయితే రజిత అరెస్ట్‌ను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు (Bhadradri Kothagudem Police) ధృవీకరించలేదు. ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని, ప్రాణహాని తలపెడితే టీఆర్ఎస్‌ నేతలకు భారీ మూల్యం తప్పదని భద్రాద్రి-అల్లూరి జిల్లాల డివిజన్ కమిటీ నేత ఆజాద్ హెచ్చరించారు.

Updated Date - 2022-09-08T02:20:32+05:30 IST