Maoist celebrations: మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ

ABN , First Publish Date - 2022-08-05T15:48:10+05:30 IST

మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు, దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగింది.

Maoist celebrations: మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ

ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మావోయిస్టుల వారోత్సవాల (Maoist celebrations) ముగింపు సభ ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు, దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ముగింపు సభకు రాష్ట్ర నేత దామోదర్ హాజరయ్యారు. మూడంచెల భద్రత వలయంలో మావోయిస్టులు ముగింపు సభ నిర్వహించారు. మూడు వేల మంది ప్రజలతో ముగింపు సభ జరిగింది. సభ చుట్టూ ల్యాండ్ మైండ్‌లు అమర్చి.. ములుగు, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు సర్కిల్ పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరారు.


ఈ సందర్భంగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ లక్కిదాదా 50 అడుగుల స్మారక స్థూపాన్ని మావోయిస్టులు నిర్మించారు. 42 రోజులుగా కార్యక్రమాలు  నిర్వహించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు.

Updated Date - 2022-08-05T15:48:10+05:30 IST