అన్నపూర్ణాదేవిగా మరగదాంబిక

ABN , First Publish Date - 2022-10-02T05:11:38+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం కాణిపాకం మరగదాంబికా అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

అన్నపూర్ణాదేవిగా మరగదాంబిక
అన్నపూర్ణాదేవి అలంకారంలో మరగదాంబిక

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 1: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం కాణిపాకం మరగదాంబికా అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అన్నపూర్ణాదేవి అలంకారం చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం కుంకుమార్చన చేసి, రాత్రి మరగదాంబికదేవి ఉత్సవ విగ్రహాన్ని కాణిపాకం వీధులలో ఊరేగించారు. చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ అర్చకులు సోమశేఖర్‌గురుకుల్‌, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:11:38+05:30 IST