
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad pawar)పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న కారణంగా అరెస్టు చేసిన మరాఠీ నటి కేతకి చితాలే (Ketaki Chitale)ను ఈనెల 18వ తేదీ వరకూ పోలీసు కస్టడీకి పంపారు. పవార్ అనే పేరును ఆమె ప్రస్తావిస్తూ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో మరాఠీలో కవిత (poem) రాశారు. పవార్ వయసును 80గా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
''నరకం వేచిచూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు'' అంటూ పవార్ అస్వస్థతను పరోక్షంగా ఆమె ప్రస్తావించారు. ఈ పోస్ట్‌పై థానె నగరంలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఒకటి, ముంబైలో రెండు కేసులు నమోదు అయ్యారు. ఈ ఫిర్యాదులు ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఆ నటి ఎవరో, ఆమె పోస్ట్ ఏమిటో తనకు తెలియదని పవార్ చెప్పారు.