22 కిలోల Marijuana పట్టివేత

ABN , First Publish Date - 2021-11-10T17:15:38+05:30 IST

రైలులో ముంబైకి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. 22 కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. రైల్వే డీఎ్‌సపీ కార్యాలయంలో ఏర్పాటు

22 కిలోల Marijuana పట్టివేత

నిందితుడి అరెస్టు..సరుకు స్వాధీనం 

హైదరాబాద్/అడ్డగుట్ట: రైలులో ముంబైకి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. 22 కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. రైల్వే డీఎ్‌సపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సికింద్రాబాద్‌ రైల్వే డీఎ్‌సపీ చంద్రభాను, సీఐ శ్రీను మాట్లాడుతూ.. ఒడిశా ఖోర్థా జాంకియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హాడపాడ గ్రామానికి చెందిన అభిజిత్‌ బోయ్‌(20) రూ.4.40 లక్షల విలువ చేసే 22 కిలోల గంజాయితో ఈనెల 7న బాలుఘాన్‌ రైల్వే స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలెక్కాడు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మీదగా ముంబైకి వెళ్లాల్సి ఉంది. ఈనెల 8న ఉదయం 11.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ ఎస్సై మాజీద్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు రామచంద్రయ్య, జపాన్‌, హరిలాల్‌, రమే్‌షరెడ్డి, మహిపాల్‌రెడ్డి, భవానీశంకర్‌, ననులాల్‌, ఆర్‌.శ్రీనివాస్‌, దుర్గాప్రసాద్‌తోపాటు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు రైలులో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఓ బెర్తులో బ్యాగును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి ఉండడంతో వెంటనే అభిజిత్‌ బోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-11-10T17:15:38+05:30 IST