మరిపెడకు కొత్త సొగసులు

Published: Fri, 25 Mar 2022 23:41:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరిపెడకు కొత్త సొగసులురోడ్డు డివైడర్లకు రంగు రంగుల బొమ్మలతో అలంకరణ

మునిసిపల్‌ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

శరవేగంగా సుందరీకరణ పనులు

మురిసిపోతున్న పట్టణ ప్రజలు

నగరాల సరసన మరిపెడ మునిసిపాలిటీ


మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), మార్చి 26: మరిపెడ బంగ్లా కొత్త సొగసులతో మెరిసిపొతుంది. మునిసిపాలిటీలోని రోడ్డు డివైడర్స్‌ రంగు రంగుల బొమ్మలతో చూపరులను ఎంతోగానో అకట్టుకుంటున్నాయి. 365, 563 నేషనల్‌ హైవేపై ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్స్‌పై ఓ వైపు మండుటెండల్లో పచ్చని చెట్లు పట్టణ వాసులతో పాటు ప్రయాణికులకు అహ్లాదం పంచుతుంటే మరో వైపు రంగు రంగుల బొమ్మలతో రోడ్డు డివైడర్స్‌ ఆకర్షణీయంగా మారి మరిపెడ బంగ్లాను మైమరిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పట్టణ సుందరీకరణపై మునిసిపల్‌ అధికారులు ప్రత్యేక నజర్‌పెట్టి పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. అదేవిధంగా నిజాం కాలం నాటి విశ్రాంతి భవనాన్ని ఎంతో అకర్షణీయంగా తయారు చేశారు.


రూ.20కోట్లతో ఆధునీకరణ పనులు 

మరిపెడబంగ్లా పంచాయతీ స్థాయి నుంచి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యాక తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరువతో అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కింద ఇక్కడి మునిసిపల్‌ అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు చేసింది. దీంతో పట్టణంలోని 15 వార్డుల్లో రూ.3.75 కోట్లతో సీసీ రోడ్లను నిర్మించారు. రూ. 2.25 కోట్లతో సైడ్‌ డ్రెయినేజీ కాల్వలను ఽఆధునీకరించారు. రూ. 50లక్షలను వెచ్చించి మరిపెడ  విలేజీలో ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. రూ.1.75 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను మెరుగుపరిచారు. రూ.2.60కోట్లతో రోడ్డు డివైడర్స్‌ ఏర్పాటు చేశారు. రూ.2కోట్లతో ఆడిటోరియం కమ్‌ ఇండోర్‌ స్టేడియం పూర్తి చేసి ఇటీవలనే అట్టహాసంగా ప్రారంభించారు. రూ.1.75కోట్లతో మోడల్‌ మార్కెట్‌, రూ.1.90కోట్ల ఖర్చు పెట్టి గ్రీన్‌ పార్క్‌ పనులు చకచక చేస్తున్నారు. 


దిన దినాభివృద్ధి

ఒకప్పుడు వరంగల్‌-ఖమ్మం రహదారిపై ఏళ్లపై లెక్కపెట్టె ఇళ్లు, అక్కడక్కడ పారేసినట్లు కనిపించే చిన్న చిన్న తండాలు, నిజాం నవాబులు కట్టించిన డాగ్‌ బంగ్లా మాత్రమే ఉండేది.  దినదినాభివృద్ధి చెందుతూ మరిపెడ బంగ్లా ఇప్పుడు నగరాల సరసన చేరింది. సినిమా థియేటర్లు, రిలయన్స్‌ ట్రెండ్స్‌, మార్ట్స్‌, వివిధ రకాల వ్యాపార మార్కెట్లు, ట్రాక్టర్ల షోరూంలు, వాణిజ్య బ్యాంకులు, షాపింగ్‌ మాల్స్‌, కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులు, పెద్ద పెద్ద బంగ్లాలతో మరిపెడ మునిసిపాలిటీ అంచెలంచెలుగా అభివృద్ధిలో పయనిస్తుంది. మహబూబాబాద్‌ జిల్లాలోనే ఇప్పుడు అతిపెద్ద బిజినెస్‌ సెంటర్‌గా మారింది.


ఎమ్మెల్యే రెడ్యాతోనే అభివృద్ధి : సింధూరకుమారి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ 

డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కృషితోనే మరిపెడ మునిసిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. పట్టణాభివృద్ధికి ఇప్పటికే రూ.20కోట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు తీసుకోచ్చారు. ఇక్కడి ఆడిటోరియం కమ్‌ ఇండోర్‌ స్టేడియం తెలంగాణ రాష్ట్రంలోనే రెండోవది. పట్టణ సుందరీకరణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. చెత్త రహిత మునిసిపాలిటి కోసం సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

మరిపెడకు కొత్త సొగసులుముస్తాబైన నిజాం కాలం నాటి విశ్రాంతి భవనం, శరవేగంగా సుందరీకరణ పనులు చేస్తున్న సిబ్బంది


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.