ప్రియుడి వ్యామోహంలో పడి భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2022-06-18T17:01:25+05:30 IST

వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో మహిళ. విషయం వెలుగులోకి రాకుండా ఉండేందుకు

ప్రియుడి వ్యామోహంలో పడి భర్తను హత్య చేసిన భార్య

సిమెంట్‌ బిళ్లకు మృతదేహం కట్టి.. ఈసా నదిలో..


హైదరాబాద్/రాజేంద్రనగర్‌: వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో మహిళ. విషయం వెలుగులోకి రాకుండా ఉండేందుకు మృతదేహానికి ప్రీకాస్ట్‌ సిమెంట్‌ బిళ్లను నైలాన్‌ తాళ్లతో కట్టి సన్‌ సిటీ సమీపంలోని ఈసా నదిలో పడేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం తేలడంతో గుట్టు రట్టయింది. రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో శంషాబాద్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌ రెడ్డి, ఏసీపీ బి.గంగాధర్‌, రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య, శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ బనారస్‌ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌కుమార్‌ (40) 17 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి గోల్కొండ ప్రాంతంలో ఉంటున్నాడు. జాతకాలు చూడటంతో పాటు ఓ చానల్‌ లో ప్రి లాన్సర్‌గా రిపోర్టింగ్‌ చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన మేరాజ్‌ బేగం(36)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇందు కోసం పేరును మహ్మద్‌ ఇక్బాల్‌గా మార్చుకున్నాడు. వారికి ఐదుగురు సంతానం.  


అవసరాలకు అప్పు ఇచ్చి.. 

గోల్కొండ ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మహ్మద్‌ లతీఫ్‌ అలియాస్‌ మన్ను (32) గతంలో మహ్మద్‌ ఇక్బాల్‌కు రూ. 2 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ పరిచయంతో ఇక్బాల్‌ భార్య మేరాజ్‌తో చనువు పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక్బాల్‌ ఇంట్లో లేనప్పుడు మహ్మద్‌ లతీఫ్‌ వారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇది తెలుసుకున్న ఇక్బాల్‌ భార్యను మందలించాడు. లతీ్‌ఫతో మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఆ విషయాన్ని లతీ్‌ఫకు మేరాజ్‌ బేగం చెప్పడంతో ఇక్బాల్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇక్బాల్‌ పథకం పన్నారు. 


సిద్ధిపేట వెళ్తున్న విషయం చెప్పి.. 

ఈ నెల 11న ఉదయం 4 గంటలకు సిద్ధిపేటకు వెళ్తున్నానని మేరాజ్‌ బేగానికి చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఆమె వెంటనే భర్త ఊరికి వెళ్తున్న విషయాన్ని ప్రియుడికి చెప్పింది. లతీఫ్‌, అతడి స్నేహితులు మహ్మద్‌ ఉస్మాన్‌(21), షేక్‌ సోఫియాన్‌(21)ల సహాయంతో ఇక్బాల్‌ను టోలిచౌకి దగ్గర ఆపి కారులో ఎక్కించుకున్నారు. కారులోనే కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం సన్‌ సిటీ సమీపంలోని ఈసా నది వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి ప్రీకాస్ట్‌ సిమెంటు బిళ్లపైన పెట్టి నైలాన్‌ తాళ్లతో కట్టి ఈసా నదిలో పారేశారు.  


మూడు రోజుల తర్వాత..

ఈసా నదిలో ఈ నెల 13న ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో అక్కడున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతదేహం వద్ద ఐడెంటిటీ కార్డు, దానిపై అతడి ఫొటో, పేరు, ఫోన్‌ నెంబర్‌ ఉన్నాయి. వాటి ఆధారంగా భార్య మేరాజ్‌ను తీసుకొచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టాలని చెప్పారు. ఆమె తెలియనట్లు నటించింది. భర్త మూడు రోజుల నుంచి కనిపించకున్నా ఫిర్యాదు చేయకపోవడంపై పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని విచారించగా,  ప్రియుడు మహ్మద్‌ లతీ్‌ఫతో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. లతీ్‌ఫతో పాటు అతడికి సహకరించిన మహ్మద్‌ ఉస్మాన్‌, షేక్‌ సోఫియాన్‌, మేరాజ్‌ బేగంలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్బాల్‌ మృతి, మేరాజ్‌బేగం అరె్‌స్టతో వారి పిల్లలు నా అనే వారు లేకుండా పోయారని డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-18T17:01:25+05:30 IST