కట్నం వేధింపులకు వివాహిత బలి

ABN , First Publish Date - 2022-01-22T05:49:14+05:30 IST

పట్టణంలోని పడమ టిగేరికి చెందిన షాకీరా(32) అత్తింటి వేధింపుల తాళలేక గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

కట్నం వేధింపులకు వివాహిత బలి
షాకీరా (ఫైల్‌)

తాడిపత్రిటౌన, జనవరి21: పట్టణంలోని పడమ టిగేరికి చెందిన షాకీరా(32) అత్తింటి వేధింపుల తాళలేక గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు పట్టణంలో ని అల్లాబకా్‌షవీధికి చెందిన అహమ్మద్‌రసూ ల్‌, గౌసియాల కుమార్తె షాకీరాను పడమటిగేరికి చెందిన యాసిన సుభానకు ఇచ్చి 2014 జనవరి19న వివాహం చేశారు. అప్పట్లోనే రూ .8లక్షల నగదుతోపాటు లక్ష రూపాయలు విలువగల ఫర్నిచర్‌, 25తులా ల బంగారం కట్నంకింద ఇచ్చారు. వివాహం అనంతరం కొన్నిరోజులపాటు అన్యో న్యంగా ఉండేవారు. కొన్నినెలల నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచుతో పాటు కుటుంబసభ్యులు వేధించేవారన్నారు. కుమార్తె బాధని చూడలేక అప్పుడప్పుడు కొం త నగదును తండ్రి ఇచ్చేవాడు. ఇప్పటికి దాదాపు రూ.45లక్షల మేర అద నంగా నగదు ఇవ్వడంతోపాటు మరొక 25తులాల బంగా రం ముట్టజెప్పాడు. అయినా ఆశ తీరని భర్త, అత్తమా మలు మరింతగా వేధించారు. దీంతో విసిగి వేసారిన షాకీరా గురువారం రాత్రి అత్తింటిలో ఫ్యానకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతు రాలికి కుమార్తె ఉంది. తండ్రి రసూల్‌ ఫిర్యాదుమేరకు  కేసు నమోదుచేసి ద ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-22T05:49:14+05:30 IST