సమావేశంలో మాట్లాడుతున్న చైర్పర్సన్ బాల్దె విజయ
పాలకవర్గ సమావేశంలో చైర్పర్సన్ బాల్దె విజయ
జనగామ టౌన్, జనవరి 23: జనగామ మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యం కోసం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చైర్పర్సన్ బాల్దె విజయ సిద్దిలింగం అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో శనివారం జరిగిన పాలకవర్గం సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. యార్డులో రైతు విశ్రాంతి భవనం, మరుగుదొడ్ల నిర్మాణం, రైతులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే కొనుగోళ్ల సీజన్లో రైతులకు అన్ని విధాలా చేయూత కోసం సమావేశంలో తీర్మానించారు. రైతులకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఆగిరెడ్డి, సెక్రటరీ జీవన్‌కుమార్, సూపర్వైజర్ మురళియాదవ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా, వ్యవసాయ మార్కెట్ యార్డులో వాస్తు దోషాలు ఉన్నాయని అధికారులు, పాలకవర్గ సభ్యులు నివారణ చర్యలు చేపట్టారు. మార్కెట్ కార్యాలయం మెయిన్ డోర్ మూసివేశారు. గేట్-1, 2లను మూసివేసి గేట్-3 ద్వారా రాకపోకలు ప్రారంభించారు.