మార్కెటింగ్‌ స్కీం యాప్‌ వల.. 40వేల మందికి టోపీ

ABN , First Publish Date - 2021-01-17T08:09:43+05:30 IST

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. రోజూ డబ్బు సంపాదించండి అంటూ మీ ఫోన్‌కు లింక్‌ మేసేజ్‌లు వస్తే జాగ్రత్త. క్లిక్‌ చేశారో..

మార్కెటింగ్‌ స్కీం యాప్‌ వల.. 40వేల మందికి టోపీ

న్యూఢిల్లీ, జనవరి 16: యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. రోజూ డబ్బు సంపాదించండి అంటూ మీ ఫోన్‌కు లింక్‌ మేసేజ్‌లు వస్తే జాగ్రత్త. క్లిక్‌ చేశారో.. ఆ యాప్‌ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే మార్కెటింగ్‌ స్కీం అంటూ వల విసిరి డబ్బు గుంజుతారు. ఈ తరహా మోసాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టిన ఓ ముఠా గుట్టు రట్టయింది.


ఈ మేరకు ఇద్దరు చైనా యువతులు, ఓ టిబెటన్‌ సహా 12మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు నెలల్లో ఈ ముఠా 40వేల మందికి కుచ్చుటోపీ పెట్టింది. ఈ ముఠాకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.4.75 కోట్లను బ్లాక్‌ చేశామని, నిందితులైన చైనా మహిళలు చాహోంగ్‌ దయోంగ్‌ (27), వూ జియాజి (54) నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.  


Updated Date - 2021-01-17T08:09:43+05:30 IST