వరుసగా 6వ రోజూ నష్టాల్లో Stock markets

ABN , First Publish Date - 2022-06-17T21:31:24+05:30 IST

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 6వ సెషన్‌, వారాంతం శుక్రవారం నాడు కూడా నష్టాల్లో ముగిశాయి.

వరుసగా 6వ రోజూ నష్టాల్లో Stock markets

ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Eqity markets) వరుసగా 6వ సెషన్‌, వారాంతం శుక్రవారం నాడు కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 135.57 పాయింట్లు లేదా 0.26 శాతం మేర నష్టపోయి 51,360.42 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.44 శాతం లేదా 67.10 పాయింట్ల మేర దిగజారి 15,300 పాయింట్ల దిగువన స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ప్రామాణిక సూచీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజుంతా ఇదే ట్రెండ్ కొనసాగింది. దీంతో గత రెండేళ్లలో దేశీయ మార్కెట్లు ఈ వారంలో అధిక నష్టాలను చవిచూశాయి.

Updated Date - 2022-06-17T21:31:24+05:30 IST