మరిన్ని సడలింపులనిచ్చిన కేజ్రీవాల్ సర్కార్

ABN , First Publish Date - 2021-06-13T18:41:38+05:30 IST

కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ సడలింపుల దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా

మరిన్ని సడలింపులనిచ్చిన కేజ్రీవాల్ సర్కార్

న్యూఢిల్లీ : కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ సడలింపుల దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా మరిన్ని సడలింపులినిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల: ప్రకటించారు. ఈ సడలింపులు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. అన్ని రకాల దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరుచుకోవచ్చని ప్రకటించారు. అయితే పాఠశాలలు, విద్యా సంస్థలు, సామాజిక, రాజకీయ సమావేశాలు,  స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ములకు మాత్రం అనుమతి లేదని, అవి పూర్తి స్థాయిలో మూసే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే 50 శాతం అనుమతితో కూర్చునేందుకు వీలుగా రెస్టారెంట్లకు అనుమతినిస్తున్నామని తెలిపారు. అయితే ఇదంతా కూడా తాత్కాలికమేనని, కేసులు మళ్లీ పెరిగితే మాత్రం ఆంక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రార్థనా మందిరాలను తెరవడానికి అనుమతినిచ్చారు కానీ, భక్తులకు మాత్రం అనుమతి లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, అయితే ఆయా కార్యాలయాల్లో పనిచేసే కర్మచారులు మాత్రం 50 శాతం హాజరుతో పనిచేయాలని నిబంధనలు విధించారు. ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం 50 శాతం ఉద్యోగులతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పనిచేయాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. 

Updated Date - 2021-06-13T18:41:38+05:30 IST