మతాలు వేరైనా.. పెళ్లితో ఒక్కటై!

ABN , First Publish Date - 2021-08-26T01:05:50+05:30 IST

అమ్మాయి ముస్లిం.. అబ్బాయి హిందూ.. మతాలు వేరైనా వారి మనసులు కలిశాయి. వారి ఇష్టాన్ని కాదనలేక అంత కంటే పెద్ద మనసుతో

మతాలు వేరైనా.. పెళ్లితో ఒక్కటై!

నిర్మల్: అమ్మాయి ముస్లిం.. అబ్బాయి హిందూ.. మతాలు వేరైనా వారి మనసులు కలిశాయి. వారి ఇష్టాన్ని కాదనలేక అంత కంటే పెద్ద మనసుతో ఇరు కుటుంబీకులు ఆ ప్రేమికులను ఒక్కటి చేసి ఆదర్శంగా నిలిచారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ముస్లిం యువతి అయేషా, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం భీంసారి గ్రామానికి చెందిన నిలేష్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురూ భిన్న మతాలకు చెందిన వారైనప్పటికీ.. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కాదనలేక పోయారు. దీంతో ప్రేమికులిద్దరికీ బుధవారం నిలేష్‌ ఇంటి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. వేర్వేరు మతాల వారైనప్పటికీ వారి కలలను సాకారం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్హం వ్యక్తం చేశారు. వివాహ బంధంతో ఒక్కటైన జంటను మనసారా ఆశీర్వదించారు.

Updated Date - 2021-08-26T01:05:50+05:30 IST