ఈ ఉదంతం యూపీలోని మధుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసీకలాంలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశంచేసి ఊరేగింపును అడ్డుకుని, బ్యాండుమేళం సభ్యులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పెళ్లి వేడుకల విషయంలో పలు నిబంధనలు ఉన్నాయని, వాటిని తప్పని సరిగా పాటించాలని పోలీసులు వారికి తెలిపారు. వివాహ వేదిక ప్రాంగణంలోనే బ్యాండుమేళం మ్యూజిక్ వాయించాలని చెప్పారు. తరువాత వారిని మందలించి విడిచిపెట్టారు. దీంతో పెళ్లి వేడుక యధావిధిగా జరిగింది.