Advertisement

ధర్మోజిగూడెంలో వివాహిత ఆత్మహత్య

Apr 23 2021 @ 01:07AM

చౌటుప్పల్‌ రూరల్‌, ఏప్రిల్‌22: చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం నాగారం గ్రామానికి చెందిన కవితకు ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన నర్సిరెడ్డితో 18నెలల క్రితం వివాహం జరిగింది. గురువారం భర్త నర్సిరెడ్డి పెట్రోల్‌ బంక్‌లో పనిచేయడానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో కవిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే కవిత ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా కవిత మృతిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.


Follow Us on:
Advertisement