వివాహిత ఆత్మహత్య

Sep 25 2021 @ 00:31AM
వరలక్ష్మి (ఫైల్‌)


విశాఖపట్టణం, సెప్టెంబరు 24: పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీహరిపురంలోని పవన్‌పుత్ర నగర్‌లో గు రువారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన వరలక్ష్మి(29)కి అదే ప్రాంతానికి చెందిన నాగబోయిన సురేశతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. సురేశకు నేవల్‌ డాక్‌యార్డులో టెక్నీషియనగా ఉద్యోగం రావడంతో దంపతులిద్దరూ ఇ క్కడికి వచ్చి శ్రీహరిపురం పవనపుత్ర నగర్‌లో నివా సముం టున్నారు. కాగా పిల్లలు పుట్టలేదని వరలక్ష్మి ఆవేదన చెందు తుండేది. గురువారం ఉదయం ఆమె భర్త డ్యూటీకి వెళ్లిపోయాడు. తిరిగి సా యంత్రం ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి వరలక్ష్మి ఫ్యాన హుక్‌కి చీరతో ఉరివేసుకుని విగతజీవిగా క నిపించింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.