శారీరక సంబంధం కోసం బలవంతం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాక్!

Published: Mon, 14 Mar 2022 00:07:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శారీరక సంబంధం కోసం బలవంతం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాక్!

ఆమె భర్త ఉండగానే తన పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అతడిని తరచుగా కలుస్తూ ఉండేది.. నెల రోజుల కిందట వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత మహిళ అతనితో శృంగారం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆమె ప్రియుడు ఇంతకుముందు వారిద్దరి మధ్య జరిగిన శృంగార వీడియోని చూపించి బెదిరించాడు. అతడి చిత్రహింసలు భరించలేక ఆ మహిళ అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కర్దాని ప్రాంతానికి చెందిన వినోదిని కన్వర్ అనే వివాహితతో సుభాష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత రెండేళ్లుగా వీరి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె సుభాష్‌ను కలవడం తగ్గించింది. కానీ సుభాష్ మాత్రం ఆమెను వదల్లేదు. గత బుధవారం ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో సుభాష్ అక్కడికి వెళ్లాడు. వినోదినితో శారీరక సంబంధం కోసం బలవంతం చేశాడు. 


తాను చెప్పినట్టు వినకపోతే ఆమె నగ్నంగా ఉన్న ప్రైవేట్ వీడియోను బయటపెడతానని బెదిరించాడు. దీంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ క్రమంలో సుభాస్ గొంతు పట్టుకుని వినోదిని నులిమేసింది. దాంతో ఊపిరి ఆడక సుభాష్ మరణించాడు. అనంతరం తనకేమీ తెలియనట్టు ఆమె ఇంటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సుభాష్‌ మొబైల్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోను చూసి పోలీసులు వినోదినిని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.