Miss Universe: మిస్ యూనివర్స్ పోటీల్లో వివాహిత మహిళలు

ABN , First Publish Date - 2022-08-22T14:03:03+05:30 IST

మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు....

Miss Universe: మిస్ యూనివర్స్ పోటీల్లో వివాహిత మహిళలు

చారిత్రాత్మక నిర్ణయం..

ముంబయి: మిస్ యూనివర్స్ పోటీల(Miss Universe Pageant) నిర్వాహకులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.మిస్ యూనివర్స్Miss Universe) అందాల పోటీలో తల్లులు, వివాహిత మహిళలను(allow married women, and mothers) అనుమతించడం ద్వారా పోటీకి అర్హతను విస్తరిస్తూ నిర్వాహకులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2023వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహితులను కూడా అనుమతించనున్నారు.ఈ సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ కొత్త నిర్ణయంతో పెళ్లి అయి, తల్లులైన మహిళలు కూడా అందాల పోటీల్లో తమ సత్తాను చూపించవచ్చని మహిళామణులు అంటున్నారు.


పాత సంప్రదాయ విధానాలకు స్వస్థి చెబుతూ వచ్చే ఏడాది నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహితులు పాల్గొనేందుకు అనుమతించడం చారిత్రాత్మక మార్పుగా మహిళలు పేర్కొంటున్నారు. ప్రపంచ అందాల పోటీల్లో(beauty contest) 70 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని మార్చడం విశేషం.గతంలో మిస్ యూనివర్స్ పోటీ నిబంధనల ప్రకారం పోటీదారులు అవివాహితులుగా ఉండాలి.మిస్ యూనివర్స్ పోటీ నిబంధనల ప్రకారం విజేతలు అవివాహితులుగా ఉండాలని, టైటిల్‌ దక్కించుకున్న తర్వాత వారి ఏడాది కాలంలో అదే హోదాను కొనసాగించాలని ఉండేది.మిస్ యూనివర్స్‌గా విజయం సాధించి,వారు పనిచేస్తున్న కాలంలో గర్భం దాల్చకుండా ఉండాలి. 


కాని మిస్ యూనివర్స్ 2020 విజేత మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా రూల్ ఈ మార్పును ప్రశంసించారు.మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆండ్రియా మెజా నిబంధనల మార్పు గురించి తెలుసుకున్న తర్వాత ఉప్పొంగిపోయారు. ‘‘అందాల పోటీల్లో వివాహితులను పోటీదారులుగా అనుమతించడం సంతోషం... సమాజంలో వస్తున్న మార్పులకు ఇది సంకేతం’’ అని మెజారూల్ వ్యాఖ్యానించారు. అందాల పోటీల్లో సెక్సిస్ట్ సుందరి అంటూ రూపొందించిన మార్గదర్శకాలను మెజా విమర్శించారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివాహితులకు అనుమతించడాన్ని కొందరు వ్యతిరేకిస్తారని, అలాంటివారు అందమైన స్త్రీ అవివాహితగా చూడాలని కోరుకుంటున్నారని మెజా పేర్కొన్నారు.మిస్ యూనివర్స్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాల్లో టీవీల ద్వారా ప్రసారం చేస్తున్నారు.

Updated Date - 2022-08-22T14:03:03+05:30 IST