షెడ్డులో ఉన్న పాడి పశువులు
తలుపుల, మార్చి27 : ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయంలో పెట్టుబడులు సహితం రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు గత ప్రభుత్వం వ్యవసాయ అను బంధ పరిశ్రమ అయిన పాడిపరిశ్రమకు అనేక రాయితీలు కల్పించి పా డిరైతులను ఆదుకుంది. జీవనో పాధుల పథకం కింద వెలుగు కార్యా లయం ద్వారా బ్యాంకులు పాడిపరిశ్రమలకు విరివిగా రుణాలు అందిం చాయి. పాడిఆవులు, గేదెలకు అవసరమగు దాణా, మాగిన పశుగ్రాసం (సైలేజ్ గడ్డి), ఎండు పశుగ్రాసం, మినరల్ మిక్చర్ తదితర వాటిని అ ప్పటి ప్రభుత్వం రాయితీతో అందిచింది. ప్రస్తుత ప్రభుత్వం పాడి రైతు లకు అన్ని రకాలైన సబ్సిడీలను తొలగించి, వారి ఆర్థికాభివృద్ధికి గండి కొ ట్టిందని, దీంతో ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయామని మండలంలోని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం, దాణా ధరలు విప రీతంగా పెగాయని, అయితే పాల ధరలు పెరగకపోవడంతో ఇబ్బం దు లు పడుతున్నామని వారు అంటున్నారు. మండల వ్యాప్తంగా పాడి ఆవు లు సుమారు 4870, పాడిగేదెలు సుమారు 3430 ఉన్నట్లు రికార్డులు తె లుపుతున్నాయి. దీనికితోడు తలుపులలో అధిక ఉష్ణోగ్రతతో సంకరజాతి పాడిపశువులు మనగడ సాగించలేక మృత్యువాత పడుతున్నాయి. పాడి పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రభుత్వం పాడిరైతులకు అన్ని రకా లైన రాయితీలను అందించి, ఆదుకోవాలని పాడిరైతలు కోరుతు న్నారు. మండలంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ముందుకొచ్చి రాయితీలు కల్పి స్తోంది. అన్ని వర్గాలవారికి సబ్సిడీలు అందిస్తూ పాడిపరిశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తోంది. మండలంలోని ఎంపికైన గ్రామాల్లో పలు కుటుం బాలకు పాడిపశువులు అందిస్తోంది. అలాగే సబ్సిడీతో దాణా అందిస్తూ, వాటి వైద్యం కోసం ప్రత్యేకంగా వైద్యులను నియమించింది. అయితే ప్ర భుత్వం ఎలాంటి సహాయసహకారాలు అందించకపోవడంతో ప్రస్తుతం పాడిరైతులు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రైతులు వాపోతున్నారు.
టీఎంఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి - ప్రసన్నబాయి, పశువైద్యశాఖ ఏడీ, తలుపుల
పాడిరైతులకు పశుగ్రాసం పెంపకం కోసం గడ్డివిత్తనాలు పంపిణీ చేస్తున్నాం. సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) కోసం పాడిరైతులు సమీప ఆర్బికేలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఎవరికీ టీఎమ్ఆర్ పంపిణీ చేయలేదు.