19 ఏళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పొందుతున్న Mars Orbiter

ABN , First Publish Date - 2022-06-26T23:19:27+05:30 IST

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రారంభించిన అత్యంత విజయవంతమైన మిషన్స్‌లో ఒకటైన

19 ఏళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పొందుతున్న Mars Orbiter

న్యూఢిల్లీ: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రారంభించిన అత్యంత విజయవంతమైన మిషన్స్‌లో ఒకటైన ‘మార్స్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్’ (Mars Express project) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు సిద్ధమైంది. మార్స్ ఎక్స్‌ప్రెస్‌లోని మార్స్ అడ్వాన్స్ రాడార్ ఫర్ సబ్‌సర్ఫేస్ అండ్ లోనోస్ఫెరిక్ సౌండింగ్ (MARSIS) పరికరం ప్రయోగించిన 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అప్‌డేట్ అందుకుంటోంది. ఇది అంగారక గ్రహం, దాని చంద్రుడు ఫోబోస్ ఉపరితలాల కింద మరింత క్షుణ్ణంగా చూడగలదు. అంగారక గ్రహంపై ద్రవ నీటి జాడల కోసం మార్సిస్ పరికరం అన్వేషిస్తోంది. అంగారక గ్రహంపైకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన తొలి మార్స్ మిషన్ ఇదే. 


2 జూన్ 2003న దీనిని ప్రయోగించినప్పటి నుంచి ఈ ఆర్బిటర్ దాదాపు రెండు దశాబ్దాలుగా భూమి పొరుగు గ్రహాలను శోధించడంతో పాటు అంగారకుడి గతం, వర్తమానం, భవిష్యత్తుపై మన దృక్పథాన్ని మార్చేసింది. ఇప్పుడు ఈఎస్ఏ ఇంజినీర్లు మార్స్ ఉపరితలం చుట్టూ ఉన్న అర్బిటర్‌కు విండోస్ 98 (Windows 98) అప్‌గ్రేడ్‌ను సిద్ధం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-26T23:19:27+05:30 IST