కొత్త ప్లాంట్ కోసం... రూ. 11 వేల కోట్లు * వ్యయం చేయనున్న మారుతి సుజుకి

ABN , First Publish Date - 2022-05-14T00:17:35+05:30 IST

హర్యానాలో కొత్త తయారీ ప్లాంట్ కోసం మారుతి సుజుకి రూ. 11 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) హర్యానాలో తన కొత్త తయారీ కేంద్రం మొదటి దశలో రూ. 11 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.

కొత్త ప్లాంట్ కోసం... రూ. 11 వేల కోట్లు  * వ్యయం చేయనున్న మారుతి సుజుకి

న్యూఢిల్లీ : హర్యానాలో కొత్త తయారీ ప్లాంట్ కోసం మారుతి సుజుకి రూ. 11 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  ఇండియా (ఎంఎస్‌ఐ) హర్యానాలో తన కొత్త తయారీ కేంద్రం మొదటి దశలో రూ. 11 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది.


సోనిపట్ జిల్లాలోని IMT ఖార్‌ఖోడాలో HSIIDC (హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)తో కలిసి 800 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రక్రియను కంపెనీ శుక్రవారం పూర్తి చేసింది. సంవత్సరానికి 2.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో కొత్త ప్లాంట్ మొదటి దశ 2025 నాటికి, పరిపాలనా అనుమతులకు లోబడి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో పెట్టుబడి రూ.11 వేల కోట్లకుపైగా ఉంటుందని ఎంఎస్‌ఐ తెలిపింది. 

Read more