మారుతి సరికొత్త ఆల్టో కే10

Published: Fri, 19 Aug 2022 00:21:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మారుతి సరికొత్త ఆల్టో కే10

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ మార్కెట్లోకి మ రో కొత్త కారు తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కె ట్లో ఉన్న చిన్న కారు ‘ఆల్టో’కి మెరుగులు దిద్ది ‘ఆల్టో కే10’ పేరుతో ఈ కొత్త కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల మధ్యన ఉన్నాయి. 2000 సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి తొలి ఆల్టో కారును విడుదల చేయగా ఈ ఏడాది జూలై వరకు మొత్తం 43.3 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.  కాగా నెక్ట్స్‌ జెనరేషన్‌ కే-సిరీస్‌ 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఆల్టో కే10.. లీటర్‌ పెట్రోల్‌కు 24.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకీ పేర్కొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.