
మార్వెల్ సంస్థ నుంచీ వచ్చిన ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ (Doctor Strange in the Multiverse of Madness) మరో రికార్డ్ సాధించింది. బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సన్ స్టారర్ సూపర్ హీరో మూవీ ‘డీసీ’ వారి ‘ద బ్యాట్ మ్యాన్’ (The Batman) చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద అధిగమించేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ విడుదలైన అన్ని సినిమాల్లోకీ అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఎంటర్టైనర్ గా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకూ ‘డాక్టర్ స్ట్రేంజ్’ ఖాతాలో 800 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైనే జమయ్యాయి! కాగా మార్చ్ నెలలో విడుదలైన ‘ద బ్యాట్ మ్యాన్’ తన లైఫ్ టైమ్ రన్ లో 769 మిలియన్ డాలర్లు వసూలు చేసింది...
2022 సంవత్సరానికిగానూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రాల్ని ఓ సారి పరికిస్తే... 400 మిలియన్ డాలర్లకు పైగా సాధించిన ‘అన్ చార్టెడ్’ టాప్ ఫోర్త్ పొజీషన్ లో ఉంది. థర్డ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ తో ‘వాటర్ గేట్ బ్రిడ్జ్’ 626 మిలియన్ డాలర్లు పొగేసింది. కాగా ‘ద బ్యాట్ మ్యాన్’ 769 మిలియన్ డాలర్స్ తో ఇంత కాలం హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కానీ, మొత్తం 820 మిలియన్ డాలర్స్ రాబట్టి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ‘డాక్టర్ స్ట్రేంజ్’ తాజాగా ‘ద బ్యాట్ మ్యాన్’ను ఓవర్ టేక్ చేయగలిగింది. అయితే, expansive Marvel Cinematic Universe లో భాగంగా వచ్చిన ‘డాక్టర్ స్ట్రేంజ్’ బాక్సాఫీస్ వద్ద మిలియన్లు దాటి బిలియన్ మార్క్ చేరుకోవటం అనుమానమే అంటున్నారు ట్రేడ్ ఎనలిస్ట్స్...