Festivals Begin: మేరీమాత ఆలయ ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-27T16:45:58+05:30 IST

తూత్తుకుడి బీచ్‌ రోడ్డులోని మేరీమాత ఆలయ(Mary Mata Temple) పదిరోజుల వార్షికోత్సవాలు మంగళవారం ఉదయం ప్రత్యేక ప్రార్థన, పతాకావిష్కరణతో ప్రారంభమయ్యాయి.

Festivals Begin: మేరీమాత ఆలయ ఉత్సవాలు ప్రారంభం

                                            - పతాకావిష్కరణలో పాల్గొన్న భక్తులు


ప్యారీస్‌(చెన్నై), జూలై 26: తూత్తుకుడి బీచ్‌ రోడ్డులోని మేరీమాత ఆలయ(Temple) పదిరోజుల వార్షికోత్సవాలు మంగళవారం ఉదయం ప్రత్యేక ప్రార్థన, పతాకావిష్కరణతో ప్రారంభమయ్యాయి. జిల్లా బిషప్‌ స్టీఫెన్‌ అంతోని నేతృత్వంలో మేరీమాత స్వరూపంతో రూపొందించిన పతాకాన్ని ఊరేగించిన(paraded) అనంతరం ఆలయ ప్రాంగణంలోని జెండా స్తంభంపై ఎగురువేశారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులు పావురాలు, బెలూన్లు ఎరుగవేసి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్‌(Minister Geethajeevan), మేయర్‌ జగన్‌, కలెక్టర్‌ సెంథిల్‌రాజ్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ చారుశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 5వ తేది మేరీమాత రథోత్సవం కోలాహలంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-07-27T16:45:58+05:30 IST