మసాలా శాండ్విచ్‌

ABN , First Publish Date - 2022-03-11T19:24:51+05:30 IST

బ్రెడ్‌ ముక్కలు- పన్నెండు: ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్‌, దోసకాయ- ఒక్కొక్కటి, ఆలుగడ్డ- మూడు (ఉడికించి మెత్తగా చేసినవి), కొత్తిమీర

మసాలా శాండ్విచ్‌

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు- పన్నెండు: ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్‌, దోసకాయ- ఒక్కొక్కటి, ఆలుగడ్డ- మూడు (ఉడికించి మెత్తగా చేసినవి), కొత్తిమీర తరుగు- కప్పు, పచ్చి మిర్చి- రెండు, చాట్‌ మసాలా- అర స్పూను, ఆవాలు, జీలకర్ర- అర స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ- చిటికెడు, నూనె, ఉప్పు, నీళ్ళు, బటర్‌- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా కొత్తిమీర, చాట్‌ మసాలా, పచ్చి మిర్చిని రుబ్బుకోవాలి. పాన్‌లో నూనెవేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక ఇంగువ వేయాలి. పచ్చి మిర్చి, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. నిమిషం తరవాత ఆలు జతచేసి వేయించి పక్కనపెట్టాలి. ఉల్లి, టొమాటో, క్యాప్సికమ్‌, దోసకాయను గుండ్రంగా కోసుకోవాలి. బ్రెడ్‌ ముక్కలపై బటర్‌ రాసి, దాని పైన కొత్తిమీర చట్నీని అంతా రాయాలి. ఆ పైన కూరగాయల ముక్కల్ని పెట్టి కొత్తిమీర చట్నీ రాసిన మరో బ్రెడ్‌ ముక్కతో మూస్తే మసాలా శాండ్విచ్‌ రెడీ.

Updated Date - 2022-03-11T19:24:51+05:30 IST