టవర్‌క్లాక్‌కు మాస్క్‌

ABN , First Publish Date - 2021-05-09T06:07:00+05:30 IST

జిల్లాలో కరోనా నియంత్రణకు మాస్కే కీలకమనీ, దీనిపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ వినూత్న కార్యక్రమం చేపట్టారు.

టవర్‌క్లాక్‌కు మాస్క్‌

వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం

అనంతపురం వైద్యం, మే 8: జిల్లాలో కరోనా నియంత్రణకు మాస్కే కీలకమనీ, దీనిపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అనంత నగర నడిబొడ్డున ఉన్న టవర్‌క్లాక్‌కు మాస్క్‌ కట్టి, కరోనాను ఎదుర్కొవడంలో మాస్క్‌ అవసరాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కరోనాకు మనిషికి అడ్డుగోడ మాస్క్‌ మాత్రమేనన్నా రు. కరోనాకు దూరంగా ఉండగలిగితే కొవిడ్‌పై సగం విజయం సాధించినట్లేనన్నారు. మాస్కే కవచమనీ, అందరూ విధిగా వాడాలని కలెక్టర్‌ కోరారు. కొవిడ్‌ పోరాటంలో సామాజిక కార్యకర్తల సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, కమిషనర్‌ మూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T06:07:00+05:30 IST