మసూర్‌ దాల్‌ కర్రీ

ABN , First Publish Date - 2021-05-22T18:57:56+05:30 IST

ఎర్ర కందిపప్పు - ఒక కప్పు, మెంతికూర - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు

మసూర్‌ దాల్‌ కర్రీ

కావలసినవి: ఎర్ర కందిపప్పు - ఒక కప్పు, మెంతికూర - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ: ముందుగా ఎర్రకందిపప్పును నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఎర్రకందిపప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కాసేపు వేగించాలి. తరువాత ధనియాల పొడి, గరంమసాల, పసుపు వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత మెంతి కూర వేయాలి. మెంతి బాగా వేగే వరకు చిన్నమంటపై ఉంచుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపుకోవాలి. అంతే... మసూర్‌ దాల్‌ కర్రీ రెడీ.



Updated Date - 2021-05-22T18:57:56+05:30 IST