టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ..?

Aug 8 2021 @ 10:20AM

టైగర్‌ నాగేశ్వరరావుగా మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే తాజా వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ను సినిమాగా తీయాలని కొన్నేళ్లుగా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సన్నాహాలు చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా నిర్మించనున్నట్టు ఆమధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. అయితే, ఇప్పుడు ఇదే కథ హీరో రవితేజ వద్దకు వచ్చినట్టు సమాచారం. 

ప్రస్తుతం రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ' సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో టైగర్‌ నాగేశ్వరరావు కథ నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు చేస్తున్న చిత్రాలు పూర్తి కాగానే టైగర్‌ నాగేశ్వరరావు మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనుండగా, భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి రానున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారక వచ్చే అవకాశం ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.