Advertisement

పవన్‌ కల్యాణే కాదు నేను కూడా.. అంటోన్న రవితేజ

Oct 5 2020 @ 19:37PM

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు వరుస సినిమాలు అంగీకరిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాలలోకి వెళ్లకముందు కూడా ఆయన ఇంత ఫాస్ట్గ్‌గా సినిమాలు ప్రకటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటికే ఐదు సినిమాలు ఆయన చేస్తున్నట్లుగా అధికారికంగా వార్తలు రావడం విశేషం. ఇక విషయానికి వస్తే.. పవన్‌ ప్రస్తుతం చేస్తున్న 'వకీల్‌ సాబ్‌' చిత్రంలో లాయర్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ వదిలారు. అయితే పవన్ కల్యాణే కాదు.. నేను కూడా లాయర్‌నే అంటున్నారు మాస్‌ రాజా రవితేజ.

 

అదెలా అనుకుంటున్నారా? ప్రస్తుతం రవితేజ కూడా వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఆయన చేస్తున్న క్రాక్‌ చిత్రం ఫైనల్‌ దశలో ఉంది. ఆ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు రవితేజ కమిట్‌ అయ్యారు. ఆ రెండే కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో చేయనున్న చిత్రంలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారట. బాలీవుడ్‌ చిత్రం 'జాలీ ఎల్‌ఎల్‌బి' చిత్ర తరహాలో, మారుతి మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.