ఒకే వేదికపై.. ఒకేసారి.. జీవితంలో కొత్త అధ్యాయనాన్ని మొదలు పెట్టిన 108 జంటలు

ABN , First Publish Date - 2022-05-15T20:38:38+05:30 IST

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మధురానుభూతులు ఉంటాయి. ఆ తీపి జ్ఞాపకాల్లో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఈ మధ్య వధూవరులు తమ వివాహానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా

ఒకే వేదికపై.. ఒకేసారి.. జీవితంలో కొత్త అధ్యాయనాన్ని మొదలు పెట్టిన 108 జంటలు

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మధురానుభూతులు ఉంటాయి. ఆ తీపి జ్ఞాపకాల్లో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఈ మధ్య వధూవరులు తమ వివాహానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. అయితే సమాజంలో అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు కదా. వధూవరుల జీవితంలో పెళ్లి ఓ మధుర ఘట్టం అని తెలిసినా.. ఆర్థిక కారణాల వల్ల కనీస మొత్తాన్ని కూడా వెచ్చించలేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. ‘అవును కానీ.. ప్రస్తుతం ఇదంతా మాకెందుకు చెబుతున్నట్టు’ అనేగా మీ సందేహం అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 



పశ్చిమ బెంగాల్‌లో రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లల పెళ్లిల్లు చేయడానికి కూడా ఇబ్బంది పడే అలాంటి కుటుంబాలకు అండగా నిలిచిన కొందరు.. తాజాగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిలిగురి‌లో జరిగిన ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 108 జంటలు పెళ్లితో ఒక్కటయ్యాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాయి. ఈ సందర్భంగా ఓ నవవధువు మాట్లాడుతూ.. సామూహిక వివాహ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. పెళ్లి కోసం డబ్బులు వెచ్చించలేని పరిస్థితుల్లో ఇలా వివాహం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇదిలా ఉంటే.. 108 జంటలకు సంబంధించిన బంధు మిత్రలు సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. కొందరు సంప్రదాయ నృత్యాలు చేసి అక్కడికి వచ్చిన వారిని అలరించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-05-15T20:38:38+05:30 IST