సర్వేపల్లి రిజర్వాయర్‌లో భారీ దోపిడీ

ABN , First Publish Date - 2021-06-20T04:16:32+05:30 IST

జిల్లాలోని వెంకటాచలం మండలంలో గల సర్వేపల్లి రిజర్వాయర్‌లో ప్రత్యక్షంగా భారీ దోపిడి జరుగుతుందని

సర్వేపల్లి రిజర్వాయర్‌లో భారీ దోపిడీ

నెల్లూరు: జిల్లాలోని వెంకటాచలం మండలంలో గల సర్వేపల్లి రిజర్వాయర్‌లో ప్రత్యక్షంగా భారీ దోపిడీ జరుగుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. పొలాల చదునుకి మట్టి పేరుతో అనుమతులు తీసుకుని గ్రావెల్ కొల్లగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మౌనం చూస్తుంటే, ఇరిగేషన్ మంత్రికి కూడా వాటా ఉందనే అనుమానాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇది ఎమ్మెల్యే స్కామా, మంత్రి స్కామా, లేక ఇద్దరు కలిసి చేస్తున్న స్కామో తేల్చాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-20T04:16:32+05:30 IST