
చండీగఢ్: అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రి (Guru Nanak Dev Hospital)లో ఈ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రిలోని రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి