
ఆర్మీ సాయం కోరిన అధికారులు
అల్వార్ : రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ సరిస్కా టైగర్ రిజర్వ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.మంటలు రిజర్వ్‌లోని వన్యప్రాణులకు హాని కలిగిస్తాయని అటవీశాఖ అధికారులు భయపడుతున్నారు.గుర్తు తెలియని కారణాలతో అడవిలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అడవీలో దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో మంటలు వ్యాపించాయి. దాదాపు 200 మంది జిల్లా అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.అల్వార్ జిల్లా యంత్రాంగం, టైగర్ రిజర్వ్ అధికారులు మంటలను అదుపు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆర్మీ సహాయం అభ్యర్థించారు.టైగర్ రిజర్వు ఫారెస్టులో మంటలను అదుపుచేసేందుకు మంగళవారం నుంచి ఆర్మీ పనులు ప్రారంభిస్తోంది.
సరిస్కా టైగర్ రిజర్వ్‌లోని అక్బర్పూర్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల ఆ ప్రాంతంలోని చెట్లు, జంతుజాలానికి నష్టం వాటిల్లింది. ఇటీవలే రెండు పిల్లలకు జన్మనిచ్చిన ఎస్టీ-17 అనే పులికి ప్రమాదం జరుగుతుందని అటవీ రిజర్వ్ అధికారులు భయపడుతున్నారు.మంగళవారం రెండు హెలికాప్టర్లతో హైడ్రాలిక్ వ్యవస్థను ఉపయోగించి నీటిని వ్యాప్తి చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి