30 మందితో వెళ్తున్న ఏసీ బస్సు.. తెల్లవారుజామున సడన్‌గా మంటలు.. అక్కడికక్కడే ఆపేసి డ్రైవర్ పరార్.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-21T20:51:27+05:30 IST

30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏసీ బస్సు షార్ట్ సర్క్యూట్‌కు గురైంది..

30 మందితో వెళ్తున్న ఏసీ బస్సు.. తెల్లవారుజామున సడన్‌గా మంటలు.. అక్కడికక్కడే ఆపేసి డ్రైవర్ పరార్.. చివరకు..

30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏసీ బస్సు షార్ట్ సర్క్యూట్‌కు గురైంది.. తెల్లవారుజాము సమయంలో హఠాత్తుగా మంటలు రేగాయి.. విషయం పసిగట్టిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా బస్సును రోడ్డు పక్కన ఆపి పారిపోయాడు.. క్లీనర్ కూడా డ్రైవర్‌తో పాటే పరిగెత్తాడు.. పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి కిందకు దూకేశారు.. అయితే బస్సుతో పాటు వారి లగేజీ కూడా కాలిపోయింది. 


బీహార్‌లోని కిషాన్ గంజ్ నుంచి పాట్నా వెళుతున్న ఏసీ బస్సు కింది భాగంలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని డ్రైవర్, క్లీనర్ గమనించారు. వారు ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా బస్సును రోడ్డు పక్కన ఆపేసి పారిపోయారు. కొద్ది సేపటి తర్వాత ప్రయాణికులకు అసలు విషయం తెలిసింది. దీంతో వారు బస్సు అద్దాలను పగలగొట్టి కిందకు దూకేశారు. ఆ తర్వాత బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికులందరూ సురక్షితంగానే బయటపడ్డారు. అయితే వారి లగేజీ మొత్తం కాలిపోయింది. 


స్థానికులు అగ్నిమాపక దళానికి, పోలీసులకు సమాచారం అందించారు. బిజీగా ఉండే ఎన్‌హెచ్-57 రహదారిపై భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. కాలిపోయిన బస్సులోని ప్రయాణికులందరూ పోలీసులు వచ్చే సమయానికే పాట్నా వేళ్లే వేరే బస్ ఎక్కేశారు. బస్ నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2022-03-21T20:51:27+05:30 IST