Viral Video: సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన భారీ ఫ్లై ఓవర్.. షాక్‌కు గురైన ప్రయాణికులు!

ABN , First Publish Date - 2022-08-13T03:05:26+05:30 IST

చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఫ్లై ఓవర్ (Flyover Collapses) కూలిపోవడంతో షాక్‌కు గురయ్యారు.

Viral Video: సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన భారీ ఫ్లై ఓవర్.. షాక్‌కు గురైన ప్రయాణికులు!

చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఫ్లై ఓవర్ (Flyover Collapses) కూలిపోవడంతో షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ భయానక ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) సోలన్‌లో చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో కల్కా-సిమ్లా జాతీయ రహదారిపై ఈ ఫ్లై ఓవర్ ఉంది.


భారీ వర్షాల కారణంగా ఈ ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే నిత్యం బిజీగా ఉండే ఆ రహదారిపై ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. ట్రక్కులు, కార్లు, ఇతర వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి. కాగా, ప్రమాదం కారణంగా ఈ టన్నెల్‌ను అధికారులు మూసివేశారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2022-08-13T03:05:26+05:30 IST