పెదబుడ్డిడిలో భారీ చోరీ

ABN , First Publish Date - 2022-05-21T06:16:14+05:30 IST

పెదబుడ్డిడి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.

పెదబుడ్డిడిలో భారీ చోరీ

  ఐదున్నర తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.6వేలు  అపహరణ 

 జియ్యమ్మవలస:  పెదబుడ్డిడి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన పడాల వెంకటరమణ ఇంట్లో రాత్రి చొరబడిన దుండగులు బీరువాలో ఉన్న ఐదున్నర తులాల బంగారం, 23 తులాల వెండి, రూ. 6 వేలు అపహరించారు. ఉదయం లేవగానే గమనించిన వెంకటరమణ వెంటనే ఎస్‌ఐ తనీష్‌కు ఈ విషయం తెలిపారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌ టీంను రప్పించి దర్యాప్తు చేయి స్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా తన నెంబరు 9121109479కు తెలియజే యాలని కోరారు.

Updated Date - 2022-05-21T06:16:14+05:30 IST