ఇజ్రాయెల్‌లో బయటపడిన భారీ వైన్ ఫ్యాక్టరీ

ABN , First Publish Date - 2021-10-14T06:14:23+05:30 IST

ఇజ్రాయెల్ దేశంలో 1500 ఏళ్ల పురాతనమైన వైన్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. ఇజ్రాయెల్ పురాతత్వ ఆ దేశపు శాస్త్రవేత్తలు..

ఇజ్రాయెల్‌లో బయటపడిన భారీ వైన్ ఫ్యాక్టరీ

జెరూసలెం: ఇజ్రాయెల్ దేశంలో 1500 ఏళ్ల పురాతనమైన వైన్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. ఇజ్రాయెల్ పురాతత్వ ఆ దేశపు శాస్త్రవేత్తలు మంగళవారం ఈ భారీ వైన్ ఫ్యాక్టరీని కనిపెట్టారు. బైజంటైన్ కాలానికి సంబంధించిన ఈ ఇండస్ట్రియల్ వైన్ ఫ్యాక్టరీలో ఏటా 2 మిలియన్లు(20 లక్షలు) లీటర్ల వైన్ తయారయ్యేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఇదే అత్యంత పెద్ద వైన్ ఫ్యాక్టరీ అయి ఉంటుందని, ఇంతపెద్ద వైన్ ఫ్యాక్టరీ ప్రపంచంలో మరొక్కడా ఉన్నట్లు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కచ్చితంగా చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో అనేక వేర్ హౌస్‌లు ఉన్నాయని, వీటిలో వైన్‌ను నిల్వ ఉంచేవారని, ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకునేవారని వివరించారు. అంతేకాకుండా ఈ వైన్‌ను దగ్గరలోని గాజా, ఆష్‌కెలాన్ అనే పేర్లతో పిలుచుకునే వారని వివరించారు. ఆ పోర్ట్‌ల పేరుమీదుగానే ఈ వైన్‌ను కూడా అవే పేర్లలో పిలుచుకునేవారిని పేర్కొన్నారు.



Updated Date - 2021-10-14T06:14:23+05:30 IST