తారకరామనగర్‌లో పర్యటిస్తున్న మస్తాన్‌వలి
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి
గుంటూరు, మార్చి 8: ప్రజల ఆత్మగౌరవం పెరగాలన్నా, అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి తెలిపారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం తారకరామనగర్, వాసవీనగర్, వెంకటేశ్వరకాలనీ, రజకులకాలనీ, ఆర్టీసీ కాలనీ, శారదాకాలనీ, మల్లికార్జునరావుపేట ప్రాంతాల్లో మస్తాన్‌వలితో పాటు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి ఇతర నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలతో పాటు రహదారుల విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన తాగునీటి ప్రాజెక్టును నేటికీ పూర్తి చేయలేకపోయారన్నారు.