TG News : హైదరాబాద్ పోలీసులకు శుభవార్త..

ABN , First Publish Date - 2022-05-13T12:48:06+05:30 IST

వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో 60 శాతం మంది సిబ్బంది

TG News : హైదరాబాద్ పోలీసులకు శుభవార్త..

  • 60 శాతం మందికి బీపీ, షుగర్‌, అధిక బరువు
  • ఆరోగ్యంపై దృష్టి పెట్టండి : సీపీ

హైదరాబాద్‌ సిటీ : వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో 60 శాతం మంది సిబ్బంది బీపీ, షుగర్‌, అధిక బరువుతో బాధపడుతున్నారని తెలిసిందని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 17 వేల మంది సిబ్బందికి మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కమిషనరేట్‌లో గురువారం ఇన్‌స్పెక్టర్‌, ఆపై స్థాయిలో ఉన్న అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యంపై పోలీసులు తగిన శ్రద్ధ చూపాలన్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారి రోజూ సాయంత్రం 3 నుంచి 5 వరకు ఫిర్యాదులు స్వీకరించాలని, ఈ మేరకు నోటీస్‌ బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సివిల్‌ వివాదాల్లో తలదూర్చడం, గ్యాంబ్లింగ్‌ డెన్‌లపై కేసుల నమోదులో అలక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీలు శ్రీనివాస్‌, చౌహాన్‌, జాయింట్‌ సీపీలు రంగనాథ్‌, విశ్వప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


ఆర్టీసీతో సమన్వయం..

నగరంలో సిటీ బస్సుల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు  చెక్‌పెట్టేందుకు ఆర్టీసీ ముఖ్య అధికారులతో జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ రంగనాథ్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బిట్స్‌ పిలానీ బృందంతో కలిసి  రోడ్లపై అధ్యయనం చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్‌ ఎన్‌  ప్రకా్‌షరెడ్డి, టీఎ్‌సఆర్టీసీ హెచ్‌క్యూ రీజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్నతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Read more