‘రుడా’కు మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2022-05-22T06:54:58+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ(రుడా)కు ఇక కొత్త మాస్టర్‌ప్లాన్‌ రానుందని, లీ అసో యేషన్‌ ఈ ప్లాన్‌ను తయారుచేస్తుందని రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి తెలిపారు.

‘రుడా’కు మాస్టర్‌ ప్లాన్‌
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రుడా చైర్‌పర్సన్‌ షర్మిళారెడ్డి

  • లీ అసోసియేషన్‌తో ఒప్పందం
  • చైర్‌పర్సన్‌ షర్మిళ, వీసీ దినేష్‌కుమార్‌ అధికారులతో సమీక్ష

రాజమహేంద్రవరం, మే 21(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ(రుడా)కు ఇక కొత్త మాస్టర్‌ప్లాన్‌ రానుందని, లీ అసో యేషన్‌ ఈ ప్లాన్‌ను తయారుచేస్తుందని రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి  షర్మిళారెడ్డి తెలిపారు. శనివారం తన చాంబర్‌లో వైస్‌ చైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌తో కలసి అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ ప్రస్తుతం రుడా పరిధిలో విలీనమైన గ్రామా లు, మండలాలను కలుపుకుని ఈమాస్టర్‌ప్లాన్‌ను రూపొంచనున్నట్టు తెలిపారు. వివిధ గ్రామాలు కలపడానికి ముసాయిదా గుడా మాస్టర్‌ప్లాన్‌పై  ఉన్న ఫిర్యాదులు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా ప్లాన్‌ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గతంలో పంపిన ముసాయిదా రుడా మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ ఇచ్చిన సలహాలు, అభ్యంతరాలు నిశితంగా పరిశీలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ర్టీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇండస్ర్టియల్‌ లేఅవుట్‌ ప్యా ట్రన్స్‌, పేదలందరికీ ఇళ్లు లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, ఇన్‌ప్రిన్సిపుల్‌ లేఅవుట్లు, అన్నిరకాల అప్రూవ్డ్‌ లేఅవుట్లు, రివర్‌ ఫ్రంట్‌ జోన్లు, రాష్ట్ర, జాతీయ రహదారులు, ప్రభుత్వ భూములు, టూరిజం భూములు ఇలా అన్ని రకాలు ఈప్లాన్‌ పరిధిలోకి వస్తాయన్నారు. సమావేశంలో కుడా వీసీ కె.సుబ్బారావు, రుడా ప్లానింగ్‌ ఆఫీసు టీజీ రామ్మెహనరావు, సెక్రటరీ శైలజ పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా ఇకపై ప్రతీ సోమవారం రుడాలో ఉదయం 10గంటల నుంచి ఒంటి గంట వరకూ స్పందన నిర్వహించనున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-05-22T06:54:58+05:30 IST