
దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి నటించిన చిత్రం 'మాస్టర్'. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బాల నేరస్థులతో నేరాలు చేయించే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా, ఆ పిల్లలను సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించే మాస్టర్ పాత్రలో విజయ్ నటించారు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ, ఈ రెండు పాత్రలు మధ్యనే ఎక్కువ సినిమా రన్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి టాక్ వినిపిస్తోంది. విజయ్ పాత్రలో హృతిక్ రోషన్.. విజయ్ సేతుపతి రోల్లో తననే నటింప చేయాలని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తుండటంతో తనతోనే ఈ పాత్రను చేయిస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.