Rangam Bhavishyavani 2022: అందుకే కుంభవృష్టి కురిపిస్తున్నా.. ‘రంగం’లో భవిష్యవాణి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-18T17:05:28+05:30 IST

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా రంగం కార్యక్రమం...

Rangam Bhavishyavani 2022: అందుకే కుంభవృష్టి కురిపిస్తున్నా.. ‘రంగం’లో భవిష్యవాణి ఆగ్రహం

హైదరాబాద్ (Hyderabad): సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి (Ujjaini Mahankali) అమ్మవారి ఆషాఢ బోనాల జాతర (Bonala Jatara) సందర్భంగా రెండోరోజు సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత (Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. అమ్మవారి విగ్రహానికి భక్తులు అడ్డుగా నిలబడవద్దని సూచించారు. అమ్మవారికి పూజలు మొక్కుబడిగా చేస్తున్నారని అన్నారు. ‘‘మీ సంతోషాన్నికే  కానీ నా కోసం కాదు... మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా... సంతోషంగా పూజ చేస్తున్నానంటున్నారు... మీ హృదయం మీద చేయి పెట్టి ఎంత సంతోషంగా చేస్తున్నారో చెప్పండి... నాకు పూజలు అందుతున్నాయో లేదో మీరే చెప్పండి.. ప్రతి ఏటా నా నోటితో చెప్పిస్తున్నారు. నా గుడిలో పూజలు సరిగా జరపడం లేదు.. మీరు గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజాలు చేయండి.సక్రమంగా పూజలు చేయండి., మొక్కుబడిగా చేయకండి., ప్రతి ఏడూ నాకు ఆటంకమే చేస్తున్నారు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్నా.. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. మీకు నచ్చినట్టు నన్ను మారుస్తారా? నేను మీ హృదయాల్లో చేరి పలుకు వినిపిస్తున్నా.. మీరు పెడదోవ పడుతున్నారు. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలి అనుకుంటున్నా.., నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరెంటి నాకు చేసేది... నేను తెచ్చుకున్నదే కదా... దొంగలు దోచినట్టుగా నాదే కాజేస్తున్నారు.. నేను సంతోషంగా లేను.. గత వర్షాల నుంచి నాకు రూపం లేకుండా కూర్చుంటున్నా.. మీ కళ్లు తెరిపించడానికే నేను కుంభ వర్షాలు కురిపిస్తున్నాను.. నా ఆగ్రహం తట్టుకోలేరనే గోరంత చూపుతున్నాను.. కొండంత తెచ్చుకుంటున్నా.. నాకు గోరంత పెడుతున్నారు.’’ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

Updated Date - 2022-07-18T17:05:28+05:30 IST